తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర దుస్థితి గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుక వెళ్లి పిహెచ్ సి అభివృద్ధికి చర్యలు చేపడతామని ఎంపీడీవో పి. అజిత అన్నారు. స్థానిక పిహెచ్సీని ఎంపీడీవో సోమవారం సందర్శించారు. ఆసుపత్రి గదులను పరి శీలించారు. ఆసుపత్రి అంతా దుస్ధితికి చెంది వుండడాన్ని గమనించారు. సిబ్బందితో మాట్లాడగా పలు సమస్యలను ఎంపీడీవోకు విన్నవించారు. ఆసుపత్రిపై బాగం పూర్తి దెబ్బతిన్నదని, వర్షాకాలంలో గదుల్లోని శ్లాబ్ నుండి నీరు కారుతూ విధులకు ఆటంకంగా వుందన్నారు. ఆసుపత్రి నందు సరిపడా టాయిలెట్లులేవని, కేవలం రెండుమాత్రమే ఉన్నాయన్నారు. టాయిలెట్ ల కి తీవ్ర ఇబ్బందిగా వుందని, ఆసుపత్రి ఆవరణలో ఓపెన్ టాయిలెట్లు నిర్మించాలని విన్నవించారు.ఈ పిహెచ్బీసీ 1968లో నిర్మించారని, బిల్డింగ్ పూర్తిగా దుస్ధితికి చెందినందున నూతన బిల్డింగ్ కి ప్రతిపాద నలు పంపాలని తెలిపారు.
1985 తరువాత నిర్మించిన పిహెచ్సీలను శిధిలంచేసి
నిర్మించారని, బిల్డింగ్ పూర్తిగా దుస్ధితికి చెందినందున నూతన బిల్డింగ్ కి ప్రతిపాద నలు పంపాలని తెలిపారు. 1985 తరువాత నిర్మించిన పిహెచ్సీలను శిధిలంచేసి కొత్తభవనాలు నిర్మించారని, ఆసుపత్రి కూలితే ప్రమాదం పొంచి వున్నందున కొత్త భవనం నిర్మించాలని విన్నవించారు. ఆసుపత్రి దుస్థితి విషయమై జిల్లా కలెక్టర్ కి నివేదిస్తామని ఎంపీడీవో తెలిపారు. ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ రవికుమార్, రమేష్, ఎం.సుజాత తదితరులు పాల్గొన్నారు.
