టీడీపీ క్లస్టర్ ఇంచార్జి రాచకొండ వెంకట్రావును దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శిలో ఘనంగా సత్కరించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాష్ట్రపార్టీ ఆదేశానుసారం వెంకట్రావును సన్మానించారు. టీడీపీ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన సుపరిపాలన తొలిఅడుగుకార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను నూరుశాతం ప్రజలకు వివరించి నందుకు టీడీపీ క్లస్టర్ ఇంచార్జి రాచకొండ వెంకట్రావును రాష్ట్రపార్టీ గుర్తించింది.ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మండలంలో వెంకట్రావు సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు పథకాలను వివరించటం జరిగిందన్నారు. రాష్ట్ర పార్టీ రాచకొండను చురుకైన కార్యకర్తగా గుర్తించదన్నారు. కార్యకర్తలు పార్టీ కార్యక్రమా లను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని డాక్టర్ లక్ష్మి తెలిపారు.
