రాజకీయ పార్టీల సభ్యులతో సమావేశం నిర్వహణ

ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో సమావేశం జరిగింది, ఈ కార్యక్రమం జిల్లా జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఆధ్వర్యంలో జరిగింది, ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, జిల్లా లో ఏప్రిల్ లో జన గణన ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన బి. ఎల్. ఓ పైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గలలో చనిపోయిన వారి ఓట్లు ఈ సర్ కార్యక్రమంతో తొలిగిపోతాయని తెలిపారు. అన్ని నియోజకవర్గలలో పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్ల ను అన్ని రాజకీయ పార్టీల వారు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్
శ్రీనివాసరావు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, కాంగ్రెస్ పార్టీ తరుపున రసూల్, టీడీపీ తరపున బి పూర్ణచంద్రరావు, బీజేపీ తరపున గుర్రం సత్యం, సిపిఎం తరపున రఘురామ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *