ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలి – జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు
అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, రమేష్, డిపిఓ వెంకటేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ లో వచ్చిన ధరఖాస్తులను నాణ్యతతోపాటు నిర్ధేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. అర్జీలు రీ-ఓపెన్ కాకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో మొత్తం 266 వినతులు రావడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *