పేద వారి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
పేర్కొన్నారు.
సోమవారం ఒంగోలు నగరంలోని 29 డివిజన్లో ఎపి హౌసింగ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిఎంఎవై 2.0 పథకం ద్వారా నిర్మితమైన పక్కా గృహల గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ తో కలసి పాల్గొని, గృహ నిర్మాణ లబ్దిదారులు సురేంద్ర కు సంబంధించిన గృహాన్ని ప్రారంభిచారు. ఈ సందర్బంగా లబ్దిదారునికి ఇంటి తాళాలను అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా లో టిడ్కో ఇళ్ళు, హౌసింగ్ ఫర్ ఆల్ కింద మంజురై నిర్మాణాలు పూర్తీ చేసుకున్న 2.50 లక్షల గృహాలను ప్రాభించడం జరిగిందన్నారు. తొలి విడతలో మూడు లక్షల ఇళ్ళు నిర్మించి లబ్దిదారులకు అందచేయడం జరిగిందన్నారు. ఈ రోజు మరో 2.50 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు అందచేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఇళ్ళ నిర్మాణాలను త్వరితగతిన పూర్తీ చేసి సంబంధిత లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యూనిట్ కాష్ట్ 2.50 లక్షలు చేయడం జరిగిందని, దీంతో పాటు అదనంగా ఎస్సీ, బీసీల గృహనిర్మాణానికి అధనంగా రూ.50 వేలు, ఎస్టీల గృహనిర్మాణానికి రూ.75 వేలు, పివిటిజి(ఆదివాసి గిరిజనులకు) లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి లబ్దిదారులు సొంతింటి కొరకు దరకాస్తు చేసుకోవాలని సూచించారు. సొంతిల్లు అనేది ఆత్మగౌరవానికి సంబంధించిందని, పిఎంఎవై 2.0 పథకం కింద సురేంద్ర బాబు చక్కగా ఇల్లు నిర్మించుకోవడం శుభపరిణామం, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ సొంతింటి కల నేరవేర్చుకోవాలన్నారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ, అందరకి స్వంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజల స్వంత ఇంటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలోని 2లక్షల 50 మంది స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నామన్నారు. ఇంటి స్దలాలు లేని పేదలకు స్దలం ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సొంతిల్లు లేని ప్రజలు ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కల నేరవేర్చుకోవాలన్నారు. సురేంద్ర బాబు చక్కగా ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని, ఈ రోజు జిల్లా కలెక్టర్ గారితో కలసి గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. 2014-19లో ఆనాడు 16,400 టిడ్కో ఇళ్ళు మంజూరు చేయగా, 4,128 ఇళ్ళను కట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఈ ఇళ్ళ నిర్మాణాలపై శ్రద్ద చుపలేదన్నారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ళ నిర్మాణాలను పూర్తీ చేయుటకు 39 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, పనులు కూడాజరుగుచున్నవని, సంబంధిత లబ్దిదారులకు త్వరలో ఇళ్ళు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.50 లక్షల ఇల్లు నిర్మించి ఈ రోజు లబ్దిదారులకు అందించే కార్యక్రమాన్ని పెద్దఎత్తున జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో తోలి విడతగా 3 లక్షల ఇల్లు ఇవ్వడం జరిగిందని, రెండవ విడతగా ఈ రోజు 2.50 లక్షల ఇవ్వడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఒంగోలు నగరంలోని 29 డివిజన్ లో ఇంటిని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలను పొందుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పధకాలను అందచేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, ఒంగోలు ఆర్డిఓ శ్రీమతి లక్ష్మి ప్రసన్న, ఒంగోలు మున్సిపల్ కమీషనర్ శ్రీ వెంకటేశ్వర రావు, ప్రజలు, గృహ నిర్మాణ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

