తాళ్లూరు లో మండల స్థాయి జీఎల్ ఎఫ్ ఎన్ పరీక్షలు నిర్వహణ

తాళ్లూరు మండల స్థాయిలో గ్యారెంటెడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీ ఎఫ్ ఎల్ ఎన్) పరీక్షలను వికే ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. మండలంలో ఒకటి నుండి 5 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 75 రోజుల పాటు ఎంఈఓ
జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్ రావుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఈ శిక్షణ వలన విద్యార్థుల అభ్యసన స్థాయిలు మెరుగు పడటంతో పాటు ఉపాధ్యాయులు సైతం పోటీ తత్వంతో తమ పాఠశాల విద్యార్థులను చక్కగా తయారు చేసారని ఎంఈఓ సుబ్బయ్య కొనియాడారు. విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులను ఎంఈఓ -2 నుధాకర్ రావు అభినందించారు. మండల స్థాయిలో ఎంపీపీఎన్ పాఠశాలలు సోమవరప్పాడు పాఠశాలకు 1వ తరగతికి చెందిన కమన్విత, అయ్యల పాలెంకు చెందిన జి నిశాంత్ (2వ తరగతి), జెడ్పీహెచ్ఎన్ మధన్ బాబు (4వ తరగతి), బికే పాడు ఎస్సీ ( విఆర్)కు చెందిన సీహెచ్ వెంకట రెడ్డి (5వ తరగతి) మండల స్థాయిలో విజేతలుగా నిలచారు. ఎంపీడీఓ అజిత విజేతలకు బహుమతులు అందించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చాటాలని దీవించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *