జిల్లాలోని యువత ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకమైన సెంచూరియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సదరు యూనివర్సిటీతో జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టర్ పి.రాజాబాబు ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం (ఎం.వో.యు) చేసుకుంది. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యత గల గనులు, ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రో కార్బన్, సోలార్, డ్రోన్స్ రంగాలలో ఉచిత శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మరియు సహ వ్యవస్థాపకులైన ప్రొఫెసర్ డి.ఎన్.రావు, యూనివర్సిటీ ప్రతినిధి జె.ఎన్.రావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, తదితరులు పాల్గొన్నారు.
