జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటిగంగ భవాని అమ్మవారి ఆలయకమిటీ నూతన చైర్మ న్ గా సానె సురేష్ పాలక వర్గాన్ని ని యమిస్తూ సోమవారం ఉత్తర్వులు అందాయి. పాత పాలకవర్గ పదవీకాలం పూర్తి కావటంతో నూతన కమిటీని నియమించారు, నూతన కమిటీ అధ్యక్షుడిగా సానె సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స భ్యులుగా సానెరంగమ్మ, ఎమ్మని వెంకటేశ్వర్లు , ఇట్టా హెహేలమ్మ, పేరుపాక బోడెమ్మ, నారాయణ లక్ష్మి, కటకంశెట్టి లక్ష్మి, గుడిపాటి మీనాక్షి, పుట్టా వెంకటసుబ్బయ్య, పుట్టా రమణమ్మ. గోళ్లపాటి ఆదెయ్య లను నిమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మంగళవారం సాయంత్రం గుంటి గంగమ్మ ఆలయ ఆవర ణలో పాలవర్గాన్ని దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ సత్యనా రాయణ, ఈవో నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంక టేశ్వరరెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, ప్రసన్న , ఆర్.ఎ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

