ప్రతి ఇంటికీ వివిధ సంక్షేమ పథకాలను చేర్చిన ఘనత బీ ఆర్ ఎస్ కే దక్కింది….సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్.

సికింద్రాబాద్, ఏప్రిల్ 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత తమ(బీ ఆర్ ఎస్ )కే దక్కిందని, పేద ప్రజలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు ప్రాముఖ్యతను
కల్పిస్తున్నామని సికింద్రాబాద్
శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్. ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య ఖరీదైన వ్యవహారంగా మారిన నేపధ్యంలో సికింద్రాబాద్ కు చెందిన అత్యధికులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరటని కల్పిస్తున్నామని తెలిపారు. దళారీల ప్రమేయం లేకుండా, డబ్బులు పొందేందుకు ఎవ్వరికీ లంచాలు చెల్లించాల్సి అవసరం లేదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ప్రజలకు నిరంతరం తాము అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, రాసురి సునీత, బీ ఆర్ ఎస్ యువ నేత రామేశ్వర్ గౌడ్, సమన్వయ కర్త రాజా సుందర్ , అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 38 మంది లబ్దిదారులకు రూ. 17 లక్షల మేరకు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులు, ముగ్గురు రోగులకు రూ. ఆరు లక్షల విలువజేసే ఎల్.ఓ.సి. పత్రాలను పద్మారావు గౌడ్ అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *