జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగా భవాని తిరునాళ్లను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ కోరారు. ఆలయ ప్రాంగణ పరిధిలో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. దర్శి సీఐ రామారావు, ఎస్సై మల్లిఖార్జున రావు, ఈఓ నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వాసు లు పాల్గొన్నారు. దర్శి డీఎస్పీ లక్ష్మి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రబల నిర్వాహకులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా తిరునాళ్లు నిర్వహించుకుంటే మంచి పేరు వస్తుందని, భక్తుల సౌకర్యార్థం పాటిచాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

