పంచాయితీ సర్పంచిల పదవీ కాలం ముగియటంతో గురువారం నుండి పంచాయితీలకు ప్రత్యేక పరిపాలన అధికారులను నియమిస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు వెలువరించినట్లు ఎంపీడీఓ అజిత లెలిపారు. నాగంబొట్ల పాలెం కు ఎంపీడీఓ కార్యాలయపర్యవేక్షకుడు గోపాల క్రిష్ణ, లక్కవరం, శివరామపురం, విఠలాపురం పంచాయితీలకు అగ్రికల్చర్ ఆఫీసర్ బి ప్రసాద రావు, బొద్దికూరపాడు, కొర్రపాటి వారి పాలెం, వెలుగు వారి పాలెంలకు డిప్యూటీ ఎంపీడీఓ వి శ్రీనివాస రావు, మాధవరం, మల్కాపురంలకు ఎంఈఓ -1 సుబ్బయ్య, మన్నేపల్లికి ఎంఈఓ-2 ఎల్ నుధాకర్ రావు, దోనకాయల పాడు, తూర్పుగంగవరం, రామభద్రాపురం, తాళ్లూరులకు ఎంపీడీఓ పి అజిత, బెల్లంకొండ వారి పాలెం, తురకపాలెంలకు తహసీల్దార్ బి వి రమణా రావులను ప్రత్యేక అధికారులుగా నియమితులైనారు.
తాళ్లూరు మండలంలో పంచాయితీలకు ప్రత్యేక అధికారుల నియామకం
01
Apr