బేగంపేట ఏప్రిల్ 2
(జే ఎస్ డి ఎం న్యూస్) .:
మనోజపం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం పటిష్టం.వాతాత్మజం వానర యూధాముక్యం శ్రీ రామ దూతం శిరసా నమామి. అంటూ భక్తులు హనుమాన్ ను స్తుతించారు. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పౌర్ణమి గురువారం శ్రీ హనుమత్ విజయోత్సవం సర్దార్ పటేల్ రోడ్డు శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగింది. హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయకార్యనిర్వాహణాధికారి యం. శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 4 గంటల నుండి 4. 30 నిమిషముల వరకు సుప్రభాత సేవ 4. 30 నిమిషాల నుండి 6 గంటల వరకు హోమం సామూహిక అభిషేకాలు నిర్వహించారు. గం 6ల నుండి 6:30 వరకు అన్నపూజ చేశారు. ఉదయం గం 6:30 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు సింధూర అలంకరణ, హారతి, మహా నివేదన మంత్రపుష్పం నిర్వహించారు. ఉదయం గం 7:30 నుండి భక్తులకు అర్చన తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. ఈ సందర్భంగా దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.



