అమరావతికి చట్టబ
ద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఆమోదించడంతో గురువారం రాత్రి తాళ్లూరు మండలంలో లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
కార్యక్ర మంలో టీడీపీ మండల ధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ ఎడమకంటి వెంకటేశ్వరరెడ్డి, కరువది మేజర్ నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగిరెడ్డి , క్లస్టర్ ఇంచార్జ్ రాచకొండ వెంకట్రావు , కె. రామకోటిరెడ్డి నాగార్జున రెడ్డి , గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి ,గ్రామ నాయకుడు ఎడమ కంటి సుబ్బారెడ్డి సిహెచ్ వీరనాగిరెడ్డి , రామారావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండల మహిళాసంఘం అధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలో తాళ్లూరు ఎస్సీ కాలనీ, కొత్త పాలెం గ్రామాల్లో పొదుపు మహిళలు కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు.

