తెలంగాణ ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణి ప్రసాద్.

హైదరాబాద్, ఏప్రిల్ 3,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి. గౌతమి తో కలిసి, శుక్రవారం హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇద్దరు అధికారులను వారి కొత్త బాధ్యతల స్వీకరణపై అభినందిస్తూ, రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల బలోపేతం, ముఖ్య పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, అలాగే ప్రస్తుత మరియు రాబోయే పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని మంత్రి జూపల్లి వారికి సూచించారు. వాణి ప్రసాద్, పి. గౌతమి తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరియు ప్రభుత్వ లక్ష్యాలను
సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు తాము కృషి చేయనున్నట్లు వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *