హైదరాబాద్ ఏప్రిల్ 3
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ముంబై నుండి హైదరాబాద్ కు అక్రమంగా మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న నైజీరియన్ మహిళ జేమ్స్ టెస్లింగ్ యామ్యునల్ (34)ను సికింద్రాబాద్ డిటిఎఫ్ పోలీసుల బృందం అరెస్టు చేసింది.ముంబై నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చి విక్రయించే క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు డిటిఎఫ్ పోలీసులు తెలిపారు. నిందితురాలి నుండి 2.35 లక్షల విలువ చేసే 7.5 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు నైజీరియన్ మహిళ డ్రగ్స్ తీసుకొస్తుందనే సమాచారం మేరకు సికింద్రాబాద్ డిటిఎఫ్ సిఐ సౌజన్య, ఎస్సై శివకృష్ణ సిబ్బంది కలిసి వలపన్ని నిందితురాలినీ పట్టుకున్నారు. నైజీరియన్ కి చెందిన జేమ్స్ టెస్లింగ్ యామ్యూనల్ వద్ద ఉన్న 7.5 కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి పారడైజ్ ప్రాంతంలోని సన్ సైన్ ఆసుపత్రి కి ప్రాంతానికి వస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ సౌజన్య ఎస్సై శివకృష్ణ కానిస్టేబుల్ రాజు రవి శిల్ప కలిసి కాపుగాసి సన్షైన్ హాస్పిటల్ ప్రాంతంలోకి ఆటోలో వచ్చిన నైజీరియన్ మహిళను డిటిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితురాలు వద్ద ఐదు పాకెట్లలో ఉన్న 7.5 గ్రామ్స్ కొకైను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో గ్రాముకురూ 15000 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాదులో రూ 30 వేల కు గ్రామ చొప్పున అమ్మడానికి డ్రగ్స్ ను తీసుకు వచ్చినట్లు విచారణలో వెల్లడయ్యింది, తదుపరి విచారణ నిమిత్తం నిందితురాలీని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు, కొకైన్ పట్టుకున్న డిటిఎఫ్ సికింద్రాబాద్ ఎక్సైజ్ డిటిఎఫ్ సిఐ సౌజన్యతో పాటు సిబ్బందిని హైదరాబాద్ డిసి అనిల్ కుమార్ రెడ్డి, ఏఎస్ శ్రీనివాసరావు. అభినందించారు.
