మానవత్వమే మిన్న – ప్రతి ఒక్కరూ మానసిక ,శారీరక వికలాంగులకు అండగా నిలవాలి.. టి జి ఎస్ పి ఎఫ్ కమాండెంట్ త్రినాథ్.బన్సీలాల్‌పేట హోమ్ ఫర్ ది డీజీబుల్డ్ లో450మంది కి అన్నదానం చేసిన టి జి ఎస్ పి ఎఫ్.

బన్సీలాల్‌పేట ఏప్రిల్ 4
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఖాకీ అంటే ప్రతి ఒక్కరూ ఊహించుకునేది కరుకుతనంగా ఉంటారని,కానీ తాము విధి నిర్వహణకోసమే కరకుగా ఉంటాం తప్ప తమకు ఖాకీ వెనుక ఓ మెత్తని మనసు ఉంటుందని నిరూపిస్తున్నారు.టి జీ ఎస్ పి ఎఫ్ కమాండెంట్ త్రినాథ్.వారి బృందం.ఇటీవల వారు జంట నగరాల పరిధిలో పేదలకు అండగా చేపడుతున్న వివిధ రకాలైన వినూత్న కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. శనివారం టి జీ ఎస్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా నేతృత్వంలో సికింద్రాబాద్ బన్సీలాల్ పేట లోని హోం ఫర్ ది డిజేబుల్డ్ లో ఆశ్రయం పొందుతున్న సుమారు 450మందికి చక్కటి భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా కమాండెంట్ త్రినాథ్ మాట్లాడుతూ తాను ఈ రోజు ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారిని చూస్తే హృదయం కదలించిందన్నారు. అన్నీ అవయవాలు సక్రమంగా వుండి మానసికంగా దృఢంగా ఉన్నవారికి ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారని,ఇలాంటి వారిని విస్మరించడం ఎంతో బాధగా ఉందన్నారు.
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనే అసలైన తృప్తి ఉందని, సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని త్రినాథ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 2026’లో భాగంగా
టి జీ ఎస్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతిలక్రా ఆదేశాలమేరకు తాము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని ఆయన తెలియ జేశారు.ఇలాంటి వారికి ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు అయినా చక్కటి భోజనాన్ని అందించాలని,వారికి అండగా నిలవాలని ఆయన పిలుపు నిచ్చారు.ఇక ముందు కూడా టి జీ ఎస్ పి ఎఫ్ తరుపున మరిన్ని సేవాకార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.పోలీస్ అధికారులు స్వయంగా దగ్గరుండి భోజనాలు వడ్డించడంతో పాటు, ఆశ్రమవాసులతో ఆప్యాయంగా మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. అధికారుల చొరవ పట్ల ఆశ్రమ నిర్వాహకులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ అన్నదాన కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సన్యాసిరావు, సూపరింటెండెంట్లు కురుమయ్య, విజయ ప్రభలతో పాటు ఎస్సైలు, ఏఎస్సైలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *