హైదరాబాద్ ఏప్రిల్ 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ సొసైటీ ఆఫ్ వాస్క్యులార్ అండ్ ఎండోవ్యాస్క్యులార్ సర్జన్స్ ఆధ్వర్యంలో డివిటి (డీప్ వీన్ థ్రాంబోసిస్) మరియు పిఎఫ్ (ఫల్మనరీ ఎంబోలిజం) కాళ్ల నరాల్లో సమస్యలపై అవగాహన కల్పిస్తూ క్రికెట్ లీగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న వ్యాస్క్యులార్ సర్జన్స్ కలిసి ఏర్పాటుచేసిన తెలంగాణ సొసైటీ ఆఫ్ వ్యాస్క్యులార్ అండ్ ఎండోవాస్క్యులార్ సర్జన్స్ ఆధ్వర్యంలో ఆదివారం మణికొండలోని లేక్సైడ్ లీగ్ స్పోర్ట్స్ క్యాఫే వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్కరు రోజు శారీరక వ్యాయామం ఉండాలని, కాళ్లల్లో వాపులు, నరాల్లో బ్లడ్ క్లాట్స్ వంటి సమస్యలు తలెత్తితే వెంటనే వ్యాస్క్యులార్ సర్జనన్ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలని తెలియజేస్తూ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి సినీ నటుడు రాజీవ్ కనకాల ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డాక్టర్లతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, డివిటి అండ్ పిఎఫ్ సమస్య తీవ్రమైందని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కాళ్లను కోల్పోవాల్సి ఉంటుందని, ప్రాథమిక దశలోనే డాక్టర్ ను సంప్రదించి తగిన చికిత్సతీసుకోవాలన్నరు.
ఈ అవగాహన కార్యక్రమంలో వ్యాస్క్యులార్ సర్జన్లు డాక్టర్ పంజాల రామకృష్ణ, డాక్టర్ ప్రేమ్ చంద్ గుప్తా, డాక్టర్ నిషాన్ రెడ్డి, డాక్టర్ దేవేందర్ సింగ్, డాక్టర్ వసంత్ రెడ్డి, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ నీహార్ రంజన్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెండ్లీ మ్యాచ్ లో భాగంగా విజేతలకు రాజీవ్ కనకాల ట్రోఫిని అందజేశారు.



