బేగంపేట ఏప్రిల్ 5
(జె ఎస్ డిఎం న్యూస్) :
వేసవిలో రోడ్ల వెంట తాగు నీటి చలి వేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలనీ తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏ సి పి జీ .శంకర్ రాజు అన్నారు.ఆదివారం బేగంపేట అశోక్ భూపాల్ చాంబర్స్ వద్ద మినరల్ వాటర్ కియోస్క్ ను ఏ సీ పీ ప్రారంభించారు.సత్యం వెంచర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (సత్వెన్) ఆధ్వర్యంలో అశోక్ భూపాల్ చాంబర్ వద్ద మినరల్ వాటర్ కియోస్క్ ను ఏర్పాటు చేశారు. సందర్భంగా ఏసిపి శంకర్ రాజు మాట్లాడుతూ రోజు రోజుకు వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు కలిగే తాగునీటి ఇబ్బందులను తగ్గించేందుకు అనేక సామాజిక సంస్థలు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి తమ వంతు కృషి చేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా సత్యం వెంచర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా ప్రజలకు ప్రతి వేసవిలో చల్లని మినరల్ వాటర్ అందించేందుకు టీఎస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమారి.కారణంగా నిర్వహించలేకపోయారని
ఈ సంవత్సరం తిరిగి ప్రారంభించినట్లు ఎసిపి తెలియజేశారు. సత్వెన్ సీఈవో శ్రీనివాసరావు వడ్లమూడి తదితరులు పాల్గొన్నారు.
