గ్యారెంటెడ్ ఫౌండేషనల్ లిట్రసి అండ్ న్యూమరసి లో దర్శి విద్యార్థి జిల్లాస్థాయిలో ప్రతిభా చాటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని విద్యాశాఖ, 2025-26 విద్యా సంవత్సరంలో వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచడం కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్యారెంటెడ్ ఫౌండేషనల్ లిట్రసి అండ్ న్యూమరసి కార్యక్రమంలో భాగంగా 75 రోజుల కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. ప్రకాశం జిల్లాలో, జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసిన పోటీలలో దర్శి మండలంలో ఈస్ట్ వెంకటాపురంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల మూడవ తరగతి విద్యార్థి జంపాల కోమల ప్రథమ బహుమతి సాధించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాదెళ్ల శ్రీనివాసరావు ను, విద్యార్థిని నిఅడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి, మండల విద్యాశాఖాధికారులు మాలకొండయ్య రమాదేవి లు అభినందించారు.
మండల విద్యాశాఖాధికారులు మాలకొండయ్య రమాదేవి నిరంతర పర్యవేక్షణ, పాఠశాల సిబ్బంది నిరంతర కృషి విద్యార్థి విజయానికి కారణమని ప్రధానోపాధ్యాయుడు నాదెళ్ల శ్రీనివాసరావు వివరించారు. ఈ కార్యక్రమము 100 శాతం విజయవంతం అయిందని, అందుకు నిదర్శనంగా దర్శి మండలం జిల్లాస్థాయిలో ప్రధమంగా నిలిచిందని ప్రత్యేకంగా మండల విద్యాశాఖాధికారి రమాదేవిని , ప్రధానోపాధ్యాయుడు నాదెళ్ల శ్రీనివాసరావు , మరియు తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయులను అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ప్రశంసించారు. కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అని ,స్ట్రీమ్ లోని విద్యార్థులు అందరూ స్కై లోకి రావడానికి ఉపాధ్యాయులందరి నిరంతర కృషే కారణం అని , ఇదే విధంగా 2026 -27 విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాలో ఇప్పుడున్న విద్యార్థుల కంటే అదనంగా 5 నుండి 10 మంది విద్యార్థులను కచ్చితంగా నమోదు చేయాలని ,అలా చేసిన ప్రతి పాఠశాలకు వచ్చి ఆ పాఠశాల ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తానని అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు .

