దివ్యాంగులకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు చెప్పారు. సోమవారం ప్రకాశం భవనంలో 15 మంది దివ్యాంగులకు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలసి ఆయన స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఒక్కో ఫోన్ విలువ రూ.15వేలు అని, వీటిని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, ఇతర అధికారులు పాల్గొన్నారు.

