రాంగోపాల్ పేట్ ఏప్రిల్ 6 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట్ డివిజన్ లో బి జె పి నీ మరింత బలోపేతం చేస్తా మని బీ జే పి రాష్ట్ర
ఓ బి సి మోర్చా ఉపాధ్యక్షులు చీరె శ్రీకాంత్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా రాంగోపాల్ పేట్ డివిజన్ పాన్ బజార్ & రంగ్రేజీ బజార్ సుభాష్ రోడ్ లో బిజెపి జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు రాష్ట్రంలో తక్కువ సీట్లతో ఉన్న బి జె పి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జి హెచ్ ఎం సి ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకుందని రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో కీలకంగా మారే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ మల్లేష్. రాంగోపాల్ పేట్ బిజెపి డివిజన్ అధ్యక్షుడు సందీప్ వర్మ. సూర్యవంశం ప్రవీణ్, ఆకుల ప్రతాప్, దయానంద్, పులి మదన్, నరేంద్ర పాల్, గోపిటిషన్ ఉపాధ్యాయ, లక్ష్మీనారాయణ కొలెరియా, ధనరాజ్, చీర శ్రీనివాస్, మహేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.
