నిజాం పేట్ ఏప్రిల్ 6 , (జే ఎస్ డి ఎం న్యూస్) : భారతీయ జనతా పార్టీ 46
వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజాంపేట్ సర్కిల్ హనుమాన్ ఆలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమము నిజాంపేట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు అవుతుందన్నారు.రానున్న కాలంలో రాష్ట్రంలో బి జె పి మరింత బలోపేతం అవుతుందన్నారు.కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగరాజు సుమన్ రావు చక్రధ పి. వెంకటేశ్వర్ ముదిరాజ్, సచిన్, రాకేష్ ముదిరాజ్, సతీష్ ,అనేకమంది బిజెపి సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
