మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎన్ జగన్మోహన్ రెడ్డిని ఆపార్టీ తాళ్లూరు మండల ఉపాధ్యక్షుడు, మాజీ సొసైటీ అధ్యక్షుడు, మాజీ ఉప నర్పంచి పులి ప్రసాద్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలో కలిసారు. దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన చేస్తున్న పలు కార్యక్రమాలు గురించి చెప్పారు. రాబోవు కాలం మనదే అని ప్రజల పక్షాన వారికి అండగా నిలబడి పోరాడాలని కోరారు. శివన్న ఎలా ఉన్నాడంటూ కుశల ప్రశ్నలు వేసారు.

