ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని ఒంగోలు, దర్శి, కందుకూరు, మార్కాపురం రవాణాశాఖ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న వాహనాల సామర్థ్య పరీక్షలు ఇక నుంచి మద్దిపాడు మండలం అన్నంగి (గ్రోత్ సెంటర్) లోని ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ (ఏటీఎస్)లో నిర్వహించ నున్నట్లు ఉప రవాణా కమిషనర్ రాయుడు సుశీల తెలిపారు. ఇప్పటిదాకా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్ష లను ప్రభుత్వం కేపీ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీకి అప్పగించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వాహనదారులు ఇకపై ఫిట్నెస్ సర్టిఫికెట్ కి ఇక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. వాహనదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని డీటీసీ సూచించారు. ఏప్రిల్ 8వ తేదీలోపు స్లాట్స్ బుక్ చేసుకున్నవారు వాటిని రద్దు చేసుకొని 9వ తేదీకి బుక్ చేసుకోవాలని తెలిపారు.
9 నుంచి ఏటీఎస్ లో వాహనాల సామర్థ్య పరీక్షలు – ఉప రవాణా కమిషనర్ రాయుడు సుశీల
08
Apr