దళిత బహుజనరిసోర్స్ సెంటర్(DBRC)- ప్రకాశం జిల్లా
బాలికలకు విద్యహక్కు, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, లైంగిక వేధింపుల నుండి రక్షణ వంటివి బాలికలపై జరుగుతున్న వివక్షతను నిర్మూలించి వారి అభివృద్ధికి అనుకూల వాతావరం కల్పించాల్సిన అవసరం మరి అందరిపై ఉందని జిల్లా లీగల్ సెల్ ప్రొడక్షన్ ఆఫీసర్ బి. రత్న ప్రసాద్ తెలియజేశారు. తాళ్లూరు కస్తూరిబా గాంధీ విద్యాలయం నందు బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ బాల్య వివాహ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం మరియు లక్కవరం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆయన మాట్లాడినారు. ఈ కార్యక్రమంనకు డిబిఆర్సి జిల్లా కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు అధ్యక్షత వహించినారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల విద్యాశాఖ అధికారి -2 ఎల్. సుధాకర రావు మాట్లాడుతూ బాలికలు దేశ భవిష్యత్తు అని, వారికి సమాన అవకాశాలు కల్పనే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని,బాలికల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ శాఖలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజo సమిష్టిగా కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వి ఏ -నీతి ఆయొగ్ జిల్లా ప్రాజెక్ట్ అసోసియేట్ పి .సిద్దిక్ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాలలోపు బాలురకు వివాహం జరిపించటం చట్ట పరంగా నేరమని ప్రజలు గుర్తించాలని, ప్రతి బాలిక చదువుకొని సమాజంలో ఉన్నత స్థాయికి చేరేలా ఉత్సాహించాలి. బాలికల విద్య, ఆరోగ్యం,భద్రతపై అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బి.పద్మనాభం, లక్కవరం గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ఎస్. కోటేశ్వరమ్మ. ఇండియా లేబర్ లైవ్ ప్రతినిధి ఏ. కిరణ్ కుమార్, తాళ్లూరు పక్షుర్బా గాంధీ బాలిక విద్యాలయ ప్రత్యేక అధికారిని, ఉపాధ్యాయులు
విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

