ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారు.రాష్ట్రంలో హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల 2284 మంది మరణించగా, 47 27 గాయాల పాలయ్యారు…ఐక్య రోటరీ వద్ద హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం .రమేష్.

హైదరాబాద్ ఏప్రిల్ 8
(జే ఎస్ డి ఎం న్యూస్)
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారనీ,
రాష్ట్రంలో హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల 2,284 మంది మరణించగా, 4,727 మంది గాయాల పాలయ్యారనీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం .రమేష్ అన్నారు. ఐక్య రోటరీ లో బుధవారం నిర్వహించిన రోడ్డు భద్రత ప్రోత్సాహం కార్యక్రమంలో సిపి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ టి టి టాటా బిజినెస్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సర్వేజనా ఫౌండేషన్ తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ పోలీసులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనదారుల్లో ఉపాధ్యాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడం హెల్మెట్ వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం పై ప్రయాణించే సమయంలో రైడర్ తో పాటు పీలియన్ రైడర్లు కూడా హెల్మెట్ ధరించడం ఎంతో ముఖ్యమన్నారు. 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా లక్ష 72,890 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు అన్నారు. వీరిలో 44.8% మంది ద్విచక్ర వాహనదారులే హెల్మెట్ ధరించకపోవడం వల్ల 54, 568 మరణాలు లక్షకు పైగా గాయపడ్డ ఘటనలు ఉన్నాయన్నారు. జరిగిన ప్రతి రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒకటి ద్విచక్ర వాహన దారుడు దే అన్నారు. పోలీసుల నివేదికల ప్రకారం నగరంలో ప్రతి మూడు రోజులకు ఒక పీలియన్ రైడర్ హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డెలివరీ సిబ్బంది విద్యార్థులు రోజువారి ప్రయాణికులకు హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు హెల్మెట్ వాడటం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏవి గురువారెడ్డి, వైస్ చైర్మన్ రాము ఎలమంచిలి సీఈవో డాక్టర్ బి జనార్దన్ రెడ్డి సిఓఓ ప్రవీణ్ కుమార్ వనమోజు టిఎఫ్ఎంసి వ్యవస్థాపకులు సత్యనారాయణ మాదాల తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *