జలవిహార్ ఆర్వో ప్లాంట్లో భారీ పేలుడు.తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలింపు.స్వల్పంగా గాయపడ్డ ఒకరిని సోమాజిగూడ జాయ్ హాస్పిటల్ కి తరలింపు.

హైదరాబాద్ ఏప్రిల్ 8 , (జె ఎస్ డి ఎం న్యూస్) :
నెక్లెస్ రోడ్ జలవిహార్ ఆర్ వో ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించగా, స్వల్పంగా గాయపడ్డ ఒకరిని సోమాజిగూడ జాయ్ హాస్పిటల్ కి తరలించారు. అన్న సమాచారం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ ప్రాంతంలో ఉన్న ఆర్వో (RO) ప్లాంట్‌లో బుధవారం భారీ పేలుడు సంభవించింది. నీటి సరఫరా కోసం ఉపయోగించే ఈ ప్లాంట్‌లో ఒక్కసారిగా బ్లాస్ట్ చోటుచేసుకోవడంతో పరికరాలు పూర్తిగా తునాతునకలయ్యాయి. ఈ ఘటనలో ప్లాంట్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది గాయపడగా, అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అప్పుల నాయుడు, అంజి లను గాంధీ ఆసుపత్రికి తరలించగా, లక్ష్మణ్ అనే వ్యక్తిని సోమాజిగూడలోని జాయ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆర్ వో ఫిల్టర్ లేదా కంప్రెషర్‌లో అధిక పీడనం (ప్రెషర్) ఏర్పడటం వల్లే ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఖైరతాబాద్ ఏసీపీ సంజయ్, లేక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పేలుడు కారణాలపై లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *