మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగపడే పనుల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసి మారం వెంకట రెడ్డిలు కోరారు. స్థానిక వెలుగు సమావేశపు మందిరంలో బుధవారం సామాజిక ప్రజా వేదిక ఎంపీడీఓ అజిత అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డ్వామా పీడీ జోషఫ్ కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన లక్ష్యాల మేరకు ఉపాధి హామీ పనులు చేపట్టాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. పలువురుకి షోకాజ్ నోటీసులు జారీ చేసారు. 2024 పిభ్రవరి నుంచి 2025 మార్చి వరకు మండలంలో 652 పనులు రూ.7,94,03,533 కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. అందులో 16 పంచాయితీలలో డిఆర్పీలు పరిశీలించి అందులో లోపాలను నభలో వెల్లడించారు. 16 పంచాయితీలలో రూ. 26,635 లు, జరిమానాల రూ.52 వేలు కలిపి మొత్తం 78,635 విధించారు. ముందుగా డ్వామా విజిలెన్స్ అధికారి 16వ సోషల్ ఆడిట్లో మండలంలో రూ.1,14,166 ల లోపాన్ని కనుగోన్నట్లు అందులో 51,289లు నిర్ధారణ అయినట్లు, అందులో రూ. 14,373లు రికవరీ చేసినట్లు మిగిలిన నగదును కూడ ఆర్ ఆర్ యాక్ట్ ప్రకారంం రికవరీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ ఆర్పి మల్లిఖార్జున రావు, ఎపీఓ వెంకటేశ్వర్లు, టీఏలు పాల్గొన్నారు .

