రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
బుధవారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ముండ్లమూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశమై పి జి ఆర్ ఎస్, రెవెన్యూ క్లినిక్ లలో రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పురోగతి, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, 22ఏ కేసులు, జీరో ఖాతాలు, రీ సర్వే, డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ తదితర అంశాలపై అంశాల వారీగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ లలో రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరం నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ ను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను త్వరగ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ముండ్లమూరు తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది, వి ఆర్ ఓ.లు, తదితరులు పాల్గొన్నారు.

