వైసీపీ అధినేత వైఎన్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్కసుతో ఆపార్టీ నాయకులుమహిళలపై అనుచిత వ్యాఖ్యలు వ్రాసిన, ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి , ఏబీఎన్ జర్నలిస్ట్ రాధా క్రిష్ణపై చర్యలు తీసుకోవాలని తాళ్లూరు పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేసారు. ఎఎస్సై కోటేశ్వర రావుకు తమ ఫిర్యాదును అందించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బారెడ్డి, యువజన అధ్యక్షుడు విష్ణు, మడల ఉపాధ్యక్షుడు హరిబాబు, జెడ్పీటీసీ ఎల్ జీ వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు షేక్ బచ్చా, ఎంపీటీసీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు యామర్తి ప్రభుదాన్, సోము నాగార్జున రెడ్డి, గూడ గోపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగు కొండా రెడ్డి, మణి, శేఖర్, గోపి, నవీన్ లు పాల్గొన్నారు .
