జిల్లాలో జనగణన-2027 ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లు పూర్తీ అవగాహన కలిగిఉండాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు. నాగులుప్పలపాడు ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో జనగణన ప్రక్రియ పై ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్లకు
నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో గురువారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలో జనగణన-2027 ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లు జనగణన ప్రక్రియపై పూర్తీ అవగాహన కలిగిఉండాలన్నారు. ఈ శిక్షణ అనంతరం క్షేత్ర స్థాయిలో పనిచేసి జనగణన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో తహసిల్దార్ , సంబంధిత ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

