శాఖాపరంగా అధికారుల పనితీరుకు ‘ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ‘ (కే.పీ.ఐ)లో సాధించిన పురోగతే నిదర్శనం – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

శాఖాపరంగా అధికారుల పనితీరుకు ‘ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ‘ (కే.పీ.ఐ)లో సాధించిన పురోగతే నిదర్శనమని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. ప్రాథమిక రంగాలకు సంబంధించి లక్ష్యాలను నిర్దేశించుకోవడం, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంపై గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజాబాబు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పంచాయతీ రాజ్, ఐసిడిఎస్, ఆరోగ్య శాఖ, పబ్లిక్ హెల్త్, ఆర్దబ్ల్యుఎస్. విద్య శాఖ, స్కిల్ డెవెలప్మెంట్ తదితర శాఖలకు సంబంధించి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ అంశాలపై సాధించిన పురోగతి ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం శాఖల వారీగా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ను నిర్దేశిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలను గుర్తించే బాధ్యత జిల్లాస్థాయి అధికారులకు కేటాయించిందన్నారు. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సర లక్ష్యాలు, పురోగతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ దిశగా మండల స్థాయి లక్ష్యాలను గుర్తించి, స్వర్ణాంధ్ర వెబ్ సైట్ లో ఈనెల 19వ తేదీ నాటికి సంబంధిత వెబ్ సైట్ లో వీటి నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ లక్ష్యాల సాధన పై తక్షణమే దృష్టి సారించాలని, తొలి త్రైమాసికం ఎంతో కీలకమని చెప్పారు. శాఖా పరంగా ఉన్న విధులను నిర్వహించడంతో పాటు కే.పి.ఐ విషయంలోనూ ప్రత్యేక లక్ష్యంతో పనిచేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ సుధాకర్ రెడ్డి, డిపిఓ వెంకటేశ్వర రావు, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, డిఆర్డిఎ పిడి నారాయణ, డిటిసి సుశీల, డిఎస్ఓ పద్మశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *