హైదరాబాద్ ఏప్రిల్ 9 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
స్పైన్ సర్జరీ టెక్నాలజీ లేని రోజుల్లో స్పైన్ సర్జరీలో కాంప్లికేషన్లు వచ్చేవి కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని స్పైన్ సర్జరీలో స్పైన్ నావిగేషన్, హై స్పీడ్ డ్రిల్స్, ఖచ్చితత్వంతో కూడిన సేఫ్ స్పైన్ సర్జరీ టెక్నాలజిని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, కిమ్స్ సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి తెలిపారు. బేగంపేటలోని కిమ్స్ సన్లైన్ హాస్పిటల్లో అందుబాటులోకితీసుకువచ్చిన స్పైన్ సూట్ టెక్నాలజీని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగాఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్పైన్ సూట్ టెక్నాలజీ గురించి కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ హిమాన్షు ప్రసాద్మాట్లాడుతూ స్పైన్ సర్జరీ చికిత్సలో ఇదొక నూతన అధ్యాయంగా పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా రోగికి ఖచ్చితత్వంతో చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఈ టెక్నాలజీలో స్పైన్ ఎండోస్కోపీ, ఖచ్చితత్వం కోసం అధ్యాతునిక నావిగేషన్, తక్కువ కణజాలం నష్టం కలిగించే విధంగా అల్ట్రాసోనిక్ బోన్ స్కాల్పెల్, వెంట్రుక కన్నా సన్నగా ఉండే నరాలను స్పష్టంగా విజువలైజేషన్ చేసి చూపించే హై ఎండ్ సర్జికల్ మైక్రోస్కోపీ, నరాల రక్షణ కోసం ఇంట్రా ఆపరేటివ్, హై స్పీడ్ డ్రిల్ వంటి సాంకేతిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ రక్తస్రావం, వేగంగా రోగి కొలుకునే విధంగా మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. అత్యవసరైమన ట్రామా కేసులను విజయవంతంగా నిర్వహించవచ్చన్నారు. డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ నడుంనొప్పితో వచ్చిన ప్రతి వారికి ఆపరేషన్ చేస్తారనే అపోహ వద్దు ఎవరికి అవసరమో వారికి మాత్రమే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో నిర్వహిస్తామన్నారు. సన్లైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ నా ఆధ్వర్యంలో 20 ఏళ్ల క్రితం స్థాపించాం ఇప్పుడు ఈ గ్రూప్ లో 25 మందికి పైగా నిపుణులైన స్పెషలిస్టులు ఉన్నారని తెలిపారు. ఇండియలో అత్యంత పెద్ద ఆర్థోపెడిక్ గ్రూప్ గా గుర్తింపు పొందిందన్నారు. ఐసాక్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 24 హాస్పిటల్స్ మాత్రమే సభ్యత్వం పొందాయని అంతటి గుర్తింపు పొందిన సంస్థలో (సన్లైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ ) సభ్యత్వం పొందడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పైన్ సూట్ టెక్నాలజి గురించి డాక్టర్ హిమాన్షు ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వచ్చే వారం
నుంచి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో ఉచిత స్కోలియోసిస్ క్లినిక్ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో స్పైన్ సర్జన్ డాక్టర్ ఆంజనేయులు రెడ్డి, డాక్టర్ అనాగ్ చక్రవర్తి, ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎ.దినకర్లతో పాటు ఎనస్థటిస్ట్లు పాల్గొన్నారు.

