ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో మెరిసిన మారేడుపల్లి ఎస్‌ఐ నవీన్..

సికింద్రాబాద్,ఏప్రిల్ 10 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్–2025-2026 లో మారేడుపల్లి ఎస్‌ఐ నవీన్ తన అసాధారణ ప్రతిభతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ఆయన రెండు పతకాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా మెడికో-లీగల్ ఓరల్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి బంగారు పతకాన్ని సాధించగా, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఎస్‌ఐ నవీన్‌ను బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి, మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ గోపాల కృష్ణమూర్తిమాట్లాడుతూ వృత్తి పట్ల నవీన్ చూపిస్తున్న అంకితభావం, నైపుణ్యం పోలీస్ శాఖకే గర్వకారణమని కొనియాడారు. కఠినమైన పోటీ ఉండే డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించడం మామూలు విషయం కాదని, ఇలాంటి విజయాలు తోటి సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని నవీన్‌కు అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *