నాగంబొట్ల పాలెంలో టిడిపి నాయకుడు పాశం నూరిబాబు, బారతిల కుమారుడు
నవీన్, పూజశ్రీల వివాహానికి టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావులు హాజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, కరువది మేజర్ ఉ పాధ్యక్షుడు టి శివ నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కొర్రపాటి వారి పాలెంలో టిడిపి రాష్ట్ర యువజన సంఘ కార్యదర్శి వేణుబాబు తమ్ముడు నూతన వధూవరులు నరేంద్ర, నాగ రాణిల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, బడే స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వివాహ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ మాగుంట…..
తాళ్ళూరు మండలం కొర్రపాటివారిపాలెంలో కోట వెంకయ్య , వెంకాయమ్మ దంపతుల కుమారుడు సురేంద్ర నాగరాణి వివాహ మహోత్సవంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్థానిక నాయకులతోపాటు కుప్పా రంగసాయి , సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

