దర్శి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డిఎస్పీ పి. బాలమురళీ కృష్ణ తాళ్లూరు పోలీస్ స్టేషన్ ను ఆదివారం సందర్శించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలు, మిస్సింగ్ కేసుల వివరాలు పరిశీలించారు. కేసుల పురోగతి సంతృప్తి కరంగా వుందన్నారు. ప్రతి గ్రామానికి చెందిన అన్ని వివరాలు పూర్తి స్థాయి లో సేకరించటంతో పాటు అ వివరాలను రికార్డు రూపంలో తయారు చేయటం చాలా ఉపయోగకరమని అన్నారు.దీనివల్ల గ్రామాల వారి పూర్తి డేటా అందుబాటులో వుంటుందన్నారు. రౌడీషీటర్లపై నిఘావుంచివారి ప్రవర్తన ఎలా వుందో గమనిస్తూ వుండాలని, ఎస్సైకు సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్ పనితీరు సంతృప్తి కరంగా వుందన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక ఎస్సై ఎస్ మల్లిఖార్జునరావు, సిబ్బంది వున్నారు.
