ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మాచాభక్తుని రేవతి సుప్రజ డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా సాధించారు. ఆమె తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ నుంచి ఈ పట్టాను పొందారు. “సంస్కృత-ఆంగ్ల అలంకార శాస్త్రాలలోని సౌందర్య తత్వాల తులనాత్మక అధ్యయనం” అనే అంశంపై ఆచార్య రాణి సదాశివమూర్తి పర్యవేక్షణలో ఆమె తన పరిశోధన పూర్తి చేసినట్లు తెలిపారు. సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని విశ్వవిద్యాలయం ఆమోదించి డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. కాగా ఈ నెల 10వ తేదిన తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వారు మహతి ఆడిటోరింలో నిర్వహించిన ఐదవ స్నాతకోత్సవం లో రేవతి సుప్రజ డాక్టరేట్ అందుకున్నారు. రేవతి సుప్రజ స్వస్తలం మార్కాపురం జిల్లాలోని పొదిలి పట్టణం. వివాహం అనంతరం భర్త, ఇద్దరి పిల్లలతో ఒంగోలులో నివాసం ఉంటున్నారు. రేవతి సుప్రజ సాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
