గ్రామీణ ప్రాంతాలలో పేదల చెంతకు వైద్యసేవలు చేర్చేందుకే ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ మాధవీలత అన్నారు. మల్కాపురంలో ఫ్యామిలీ డాక్టర్లో అందుతున్న వైద్య సేవలకు ప్రజల వద్దకు వెళ్లి క్షేత్ర స్థాయిలో మంగళవారం పరిశీలించారు. వైద్యసేవలు అందుతున్న తీరు, సిబ్బంది పనితీరుపట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు. ఇతర సర్వేల గురించి ఆరా తీసారు. ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు. చిన్నారులతో కలసి భోజనం చేసారు. తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి బాడర్ మస్తాన్ బి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తూర్పు గంగవరంలో పీహెచ్సీని పరిశీలించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ
తూర్పు గంగవరం పీహెచ్సీని డిప్యూటీ డీఎం హెచ్ ఓ మంగళవారం ఆకస్మికంగాతనిఖీ నిర్వహించారు. ఆరోగ్య, ఆశ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. తూర్పు గంగవరం పీహెచ్సీ వైద్యాధికారి బి రత్నం తదితరులు పాల్గొన్నారు.


