కస్తూర్బా గాంధీ స్కూల్లో దళిత బహుజన రిసోర్ సెంటర్,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కావూరి నాగమణి అధ్యక్షతన సావిత్రిబాయి192వ జయంతి సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ తహశీల్దార్ ఆకుల రవిశంకర్, ఏ ఎస్ డబ్ల్యూ షేక్ రజియాబేగ్, సిడిపిఓ సిహెచ్ భారతి, జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ పాల్గొని మాట్లాడుతూ .. సామాజిక సంస్కర్త, చదువుల తల్లి జ్యోతిరావుపూలే సతీమణి బడుగు బలహీనవర్గాలకు చదువులు అందించి మొట్టమొదటి తొలి ఉపాధ్యాయురాలుగా భారతదేశంలో సంఘసంస్కర్తగా సమాజానికి మహాకవిగా,మహనీయులు చదువుల తల్లి, సావిత్రిబాయి పూలే అని వారు అన్నారు . ఆమె జననం1831 సంవత్సర కాలంలో మహారాష్ట్ర జన్మించారని ఆమె బాలికలకు 1848 సంవత్సర కాలంలో ఒక పాఠశాల ఏర్పాటు చేసి సమాజానికే వన్నె తెచ్చిన మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని వారు అన్నారు . కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు,కే మార్క్,ప్రధాన కార్యదర్శి జి ప్రేమ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షులు,నాలి మధు యాదవ్, ఏఐటీయూసీ,బర్డ్స్ ఏరియా నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, కస్తూర్బా గాంధీ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ కుమారి,ఉపాధ్యాయులు,విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

