అంబేడ్కర్ నగర్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిధులతో ఏర్పాటు చేసిన ఆర్డీఓ ప్లాంట్ మరమ్మత్తులు చేయించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్కు జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య విన్నవించారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యేను కలసి విన్నవించారు. తాళ్లూరు మండలంలో ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను అంజయ్య శాసనసభ్యుడు వేణుగోపాల దృష్టికి తీసుకువచ్చారు. 2015 సంవత్సరంలో 3.50 లక్షల రూపాయలఎంపీ గ్రాంట్ నిధులు నుండి తాళ్లూరు అంబేద్కర్ కాలనీ లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు అంజయ్య తెలిపారు. 2018 నుండి వాటర్ ప్లాంట్ పనిచేయడం ఆగిపోయిందని ముఖ్యంగా ఒంటరి మహిళలు వృద్ధులు మినరల్ వాటర్ కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి పంచాయతీ మినరల్ వాటర్ ప్లాంట్కు ఒక కిలోమీటర్ దూరం వెళ్లి మంచినీళ్లు తెచ్చుకొనుటకు చాలా ఇబ్బంది పడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు నిధులు వస్తున్నప్పటికీ తాళ్లూరు అంబేద్కర్ నగర్ వాటర్ ప్లాంట్ ను పునరుద్ధరించేందుకు అధికారులకు మనసు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ వాటర్ ప్లాంట్ ను తక్షణమే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తాళ్లూరులో నివసిస్తున్న ఎస్టీలకు స్మశాన భూమి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అంజయ్య ఎమ్మెల్యేకు తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1235 ప్రకారం అలాగే జగన్ ప్రభుత్వం దళితులందరూ స్మశాన వాటిక కేటాయించాలనే ఆదేశాల ప్రకారం ఎస్టీలకు స్మశాన భూమి కేటాయించాలని అంజయ్య ఎమ్మెల్యేని కోరారు. ఎస్టీల స్మశాన సమస్యను పరిష్కరిస్తామని శాసనసభ్యులు వేణుగోపాల్ హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు దారా అంజయ్య తెలిపారు.
