జిల్లా కలెక్టర్ ఎ.ఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మలిక గర్ను బుధవారం దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఒంగోలులో కలసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజక వర్గంలోని పలు సమస్యలపై, గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న వారి నష్టపరిహారం పెంపుపై కలెక్టర్ తో చర్చించారు. ఎస్పీని కలసిన వారిలో తాళ్లూరు, ముండ్లమూరు ఎంపీపీలు తాటికొండ శ్రీనివాస రావు, ఎస్ ఎస్ బ్రహ్మానంద రెడ్డి, జెడ్పీటీసీలు మారం వెంకట రెడ్డి, రత్నరాజు, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్ వి. వెంకట రెడ్డి, బిజ్జం సుబ్బా రెడ్డి, అంబటి వెంకటేశ్వర రెడ్డి, పలు గ్రామాల సర్పంచిలు, పలువురు ప్రజా ప్రతినిధులు కూడ ఉన్నారు.
