దర్శి లో పొదిలి రోడ్డులోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు మంగళవారం నుంచి కనిపించడం లేదు. కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించటంతో వారి అదృ శ్యంపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రామకృష్ణ తెలి పిన వివరాల ప్రకారం పొదిలి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రతి రోజూ బస్సులో కళాశాలకు వచ్చి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేవారు. ఈ క్రమంలో మంగళవారం ఒక బాలిక తండ్రి ఇద్దరినీ తన ద్విచక్ర వాహనంపై కళాశాలలో వదిలారు. సాయంత్రం మరో బాలిక బంధువు ఇంటికి తీసుకెళ్లడా నికి కళాశాల వద్దకు రాగా మధ్యాహ్నం సమయంలో ఇద్దరు బాలికలు ఇంటికి వెళతామని చెప్పి వెళ్లారని కళాశాల యాజయాన్యం తెలిపారు. స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవటంతో తల్లిదండ్రులు పోలీసు లను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం – కేస్ నమోదు
05
Jan