దర్శి పట్టణానికి చెందిన భవనం మురళీ అనే వైఎస్సార్ సీపీ కార్యకర్త పొలంలో పాముకాటుకు గురై దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ గురువారం ఆసుపత్రికి వెళ్ళి మురళిని పరామర్శించారు. ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మురళీకి మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా తదిత రులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
