రైతు సంక్షేమమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయం ఆవరణలో శుక్రవారం వైఎస్సార్ యంత్రసేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని యంత్ర సేవా పథకంపై అవగాహన కల్పించి వాల్ పోస్టర్లను పంపిణీ చేసారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ .. సన్న, చిన్న కారు రైతులకు విత్తనం నుండి కోత వరకు అవసరమైన పరికరాలను వైఎస్సార్యంత్ర సేవా కేంద్రం ద్వారా అందించి రైతులకు పెట్టుబడులు తగ్గించి ఆదాయం పెంచటమే ధ్యేయంగా ప్రభుత్వం కోట్ల విలువైన పరికరాలను సమకూర్చుతున్నట్లు సన్న, చిన్నకారు రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ జి. సుబ్బయ్య, ఎంపీటీసీ బాల కోటయ్య. ఎఈఓ నాగరాజు . విఏఏ రాజశేఖర్ రెడ్డి. వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం- రైతు పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచటమే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యవసాయశాఖ – వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభం
06
Jan