ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించినట్లయితే వ్యాధులు దరి చేరవని వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పూరి మెట్ల గ్రామంలో ని డాక్టర్ వైయస్సార్ క్లినిక్ నందు శనివారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ .. .. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరశుభ్రంగా ఉచ్చుకున్నట్లయితే వ్యాధులు దరి చేర వని అన్నారు ఇంటి చుట్టు ప్రక్కల తాగి పడవేసిన కొబ్బరి బోండాలు ప్లాస్టిక్ డిస్పోసల్ గ్లాసులు లేకుండా చేసుకోవాలన్నారు. చెత్త చెదారం లేకుండా చేసుకోవాలన్నారు. అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యాధికారులను సంప్రదించి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ శిబిరంలో 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో గర్భవతులు 8 బాలింతలు3 షుగర్35 బిపి25 జలుబు దగ్గులు జ్వరాలు 9 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 104డీఈవో వెంకట ప్రసాద్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు .
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
07
Jan