ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్వంత నియోజక వర్గంలో రోడ్ షోలను సైతం అనుమతి ఇవ్వక పోవటం దారుణమని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. తాళ్లూరు మండలం మల్కాపురం పంచాయితీలో శనివారం ఇదేమి ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వంత కార్యక్రమాలు లేని నిబంధనలు ప్రతి పక్ష పార్టీలకు ఎందుకని ప్రశ్నించారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి, చెల్లి పాదయాత్రలను ఎటువంటి ఆటంకాలు సృష్టించలేదని నేడు చంద్రబాబు ఇతర ప్రతి పక్ష పార్టీల నేతలను సీఎం అడ్డుకోవటానికి ఇటువంటి జీవోలను తీసుకువచ్చి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు ఆయనకు ఓట్లు వేసారని నేడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి కాలేషావలి, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శులు కొండా రెడ్డి, మానం రమేష్, వలి, సర్పంచి రామయ్య, వేణు, నాగార్జున రెడ్డి, సుబ్బా రావు , శ్రీనివాస రావు , క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు పాల్గొన్నారు.
