భూ రీసర్వేపై ప్రతి విఆర్డీ తగిన జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలని తహసీల్దార్ రామ్మోహన్ రావు కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం విఆర్జీల, విఎస్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ రికార్డులను ఆర్డీఓఆర్, ఎఫ్ఎల్ ఆర్, 1-బిలను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పిదప యజమాని విషయమై నిర్ధారణకు రావాలని సూచించారు. ఇతరుల పేరుతో నమోదు అయిన ఉన్న భూ విస్తీర్ణంలో ప్రస్తుతం ఎవరూ హక్కుదారులుగా ఉన్నారు అన్న విషయాలను సమీప రైతులతో, గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయానికి రావాలని, హక్కు పత్రాలు . ఇతర అనుభవ పత్రాలు ఎమైనా ఉన్న ఎడల సంపూర్ణంగా పరిశీలించాలని కోరారు. అన్ని గ్రామాలలో రికార్డులకు ముందుగా క్లియర్ చేసి, రీ సర్వే వచ్చే సమయానికి సిద్ధంగా ఉండాలని కోరారు. మిగిలిన పత్రాలు కూడ సమయం ప్రకారం అర్జీదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీరామమూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
భూ రీసర్వేపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి
09
Jan