పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, మీరు చూపించే చల్లని దీవెనలే జగనన్నకు ఆశీర్వాదాలని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు లబ్ధిదారులతో అన్నారు. సోమవారం సంతనూతలపాడు మండలం ఎండ్లూరులో రెండో రోజు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష ఆదరణ లభించింది. సంక్షేమ పథకాలకు సంబంధించిన బుక్లెట్లు ఇంటింటికి తిరిగి ఏఏ ఇంట్లో లబ్దిదారు లకు ఎంతెంత లబ్ది కలిగిందో పథకాల వారీగా వివ రిస్తూ 324 గడపలు సందర్శించారు. ఈ సందర్భం గా లబ్ధిదారులు చూపిన ఆదరణ, వారి నుంచి వస్తున్న స్పందన చూసి వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ సీఎంగా గెలిపించు కుందామని, అండగా నిలవాలని ఎమ్మెల్యే టీజేఆర్ విజ్ఞప్తి చేశారు. ఎండ్లూరు సచివాలయం పరిధిలోని
మన్నంవారిపాలెం, ఎండ్లూరు అంబేడ్కర్ నగర్, కుంచాలవారిపాలెంలోని ఇళ్లను సందర్శించారు. ఆయా గ్రామస్తుల నుంచి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక రాబాబుకు ఘన స్వాగతం లభించింది. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, ఎంపీపీ బి.విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమ ణమ్మ, స్థానిక సర్పంచ్ ఎస్.పుల్లయ్య, ఎంపీటీసీ సభ్యుడు కె.వెంకటేశ్వరరావు, దుంపా యలమం దారెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు కుంచాల అంజయ్య, చీకటి తిరుమల, డోలా చిన అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


