గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజలకు మీ గ్రామాలలోనే డాక్టర్ వైయస్సార్ క్లినిక్ల వద్ద ఏర్పాటుచేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా అందిస్తున్న సేవలతోనే మీ ఆరోగ్యం పదిలం అని వైద్యాదికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల జమ్మలమడక గ్రామంలో మంగళవారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద పెద్ద వైద్యాధికారులచే అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేటు ఆసుపత్రులకు దీటుగా గ్రామాల్లోని ఫ్యామిలీ ఫిజీషియన్ శిబిరాలు ఏర్పాటు చేసి మంచి 67 రకాల మందులు 12 రకాల టెస్టులు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలాంటి శిబిరాలకు ప్రజలు వచ్చి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ శిబిరంలో 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 20 బీపీ 25షుగర్ 2గర్భవతులు5 బాలింతలు30 జలుబు దగ్గు జ్వరాలు ఉన్న వారిని గుర్తించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పద్మాంజలి డీఈవో వెంకట ప్రసాద్ ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
ఫ్యామిలీ ఫిజీషియన్ తోనే ఆరోగ్యం పదిలం
10
Jan