ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు కోరారు. స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయం ఆవరణలో మంగళవారం ప్రకృతి వ్యవసాయ ||ఉత్పత్తుల అమ్మకం మేళాను నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని మేళాను ప్రారంభించి ప్రసంగించారు. ప్రకృతి సాగు ఉత్పత్తులను ప్రోత్సహించి రైతులను ప్రొత్సహించటం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందుబాటులోనికి తేవచ్చని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు (ఎపీసీఎన్ఎఫ్) మెనేజర్ డి సుభాషిణి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం పెంపొందించుటకు కృషి చేస్తున్నామని, తాళ్లూరు మండలంలో రైతులను ప్రొత్సహించుటకు ప్రకృతి వ్యవసాయ మేళాను నిర్వహించిన వ్యవసాయాధికారి ప్రసాదరావును అభినందించారు. కార్యక్రమంలో సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ ఎంపీడీఓ కైవై కీర్తి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, పీహెచ్సీ వైద్యాధికారి ఖాదర్ మస్తానీ, పశువైద్యాధికారి అశోక్ రెడ్డి, ఎవో ప్రసాదరావు, ఎన్డీఏ వెంకట రమణ, సిబ్బంది నరసింహులు, శివ నాగిరెడ్డి, కె. నాగి రెడ్డి, యోగేశ్వరమ్మ, అనిత, ఎసీఆర్పీఎస్ మురళి, వేణు, వెంకటేశ్వరరావు, కోటి రెడ్డి, శ్రీ ఎఈఓ నాగరాజు, విఏఏలు తదితరులు పాల్గొన్నారు.

